- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా పంట పొలాల కరెంట్ లైన్
by Kodari Anjali |
గోదావరి పుష్కరఘాట్ రోడ్డులోని పంట పొలాల్లో ఉన్న అగ్రికల్చర్ విద్యుత్ లైను వైర్లు నేలవాలి ప్రమాదకరంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

X
దిశ, మంగపేట: మండల కేంద్రం గోదావరి పుష్కరఘాట్ రోడ్డులోని పంట పొలాల్లో ఉన్న అగ్రికల్చర్ విద్యుత్ లైను వైర్లు నేలవాలి ప్రమాదకరంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మిర్చీ కల్లాల సమయంలోనే ఈ విషయమై విద్యుత్ అధికారులకు పిర్యాదులు చేసినా ఇదిగో అదిగో అంటూ కాలయాన చేస్తున్నారని విధిలేని పరిస్థితుల్లో తామే ప్రమాదమని తెలిసినా కర్రల సహాయంతో వైర్లు పైకిలేపి నులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి పంట పొలాల్లో ప్రమాదకరంగా నేలవాలి ఉన్న విద్యుత్ వైర్లను పునరుద్దరించాలని లేని పక్షంలో పంటల సమయంలో ప్రజలు, రైతులు, పశువులు మృత్యువాత పడే అవకాశాలున్నయని రైతులు బద్ది సమ్మయ్య, సాయిని నాగార్జున, బయ్య భాస్కర్, పానెం మదనయ్య, జవంగుల రవీందర్ లు హెచ్చరించారు.
Next Story






