- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు అగరబత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
by Ramesh Naini |
కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న ‘దేవా అగరబత్తి ఫ్యాక్టరీ’లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
తీవ్రరూపం దాల్చిన మంటలు
అగరబత్తి ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే ‘శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లు’ కూడా ఉండటంతో మంటలు మరింత పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమానులు వెల్లడించారు. కళ్లముందే తమ ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతి కావడంతో యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story






