ప్రైవేటు ఆసుపత్రిపై పెట్రోల్‌తో దాడి

by Kodari Anjali |

భద్రాచలం పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఒక గిరిజన మహిళా సర్పంచ్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

ప్రైవేటు ఆసుపత్రిపై పెట్రోల్‌తో దాడి
X

దిశ, భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఒక గిరిజన మహిళా సర్పంచ్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయిన పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ వెంకటరమణ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని ఆరోపిస్తూ, సర్పంచ్ బంధువులు ఆసుపత్రి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి వైద్యులు మృతురాలి బంధువులకు సమాధానం చెప్పకపోగా... రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మృతురాలి బంధువులు మండిపడుతున్నారు. వెంటనే వైద్యుడు బయటకి రావాలని కోరుతూ... ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డాక్టర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో మృతురాలి భర్త ఆగ్రహంతో ఆసుపత్రి లోనికి చొచ్చుకుని వెళ్లి రెసెప్షన్ కౌంటర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరో వైపు ఆసుపత్రి వైద్యుడు మధ్యవర్తులతో బేరసారాలు జరుపుతున్నాడని సమాచారం.

Next Story