- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండనాగుల బీసీ బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వంటశాల, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యార్థుల వసతి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలు, అవసరాలు, చదువుకు సంబంధించిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంక్షేమ వసతిగృహాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించడంలో వసతిగృహ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, వారి భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ అధికారి, మండల పార్టీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్, మాజీ ఎంపీపీ అరుణ, జిల్లా నాయకులు కాశాన్న యాదవ్, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.






