- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగాపూర్‌లో తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
నాగర్‌క ర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో గ్రామస్తులు శనివారం ఉదయం నిరసనకు దిగారు.

దిశ, అచ్చంపేట: నాగర్‌క ర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో గ్రామస్తులు శనివారం ఉదయం నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో అచ్చంపేట–అమ్రాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడు రోజుల నుండి మంచినీరు సరఫరా కావడం లేదని సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని నీరు సరఫరా కాకపోతే అవసరాలు ఎలా తీరుతాయనీ గ్రామస్తులు అగ్రహ వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.






