పెళ్లైన రెండేళ్ల తర్వాత అంటూ నాగచైతన్య పోస్ట్.. నీ అదృష్టం ఈ రోజే మొదలైందంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

శోభిత సొంతంగా వండిన డిన్నర్‌ను ప్లేట్‌లో పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను చైతూ పోస్ట్ చేశారు.

పెళ్లైన రెండేళ్ల తర్వాత అంటూ నాగచైతన్య పోస్ట్.. నీ అదృష్టం ఈ రోజే మొదలైందంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయింటైన్ చేసిన చైతూ 2024లో పెద్దలను ఒప్పించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి పనుల్లో వాళ్లు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ దొరికిన కాస్త ఖాళీ సమయంలో వెకేషన్‌లకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. శోభిత సొంతంగా వండిన డిన్నర్‌ను ప్లేట్‌లో పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను చైతూ పోస్ట్ చేశారు.

దానికి జతగా "మాకు పెళ్లయి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈరోజు మా ఆవిడ నాకు స్వయంగా వంట చేసి పెట్టింది. బహుశా ఈ రోజు నేను ఏదో మంచి పని చేసి ఉంటాను" అంటూ సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చారు. చైతూ చేసిన ఈ ఫన్నీ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. తనకు వంట చేయడం రాదని శోభిత గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. "రెండేళ్ల తర్వాత భర్త కోసం తొలిసారి కిచెన్‌లోకి అడుగుపెట్టిందా?" అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి "చైతూ.. నీ అదృష్టం ఈరోజే మొదలైందా?" అంటూ చమత్కారంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే, బిజీ షెడ్యూల్‌లోనూ భర్త కోసం శోభిత ప్రత్యేకంగా ప్రేమతో వండిపెట్టడాన్ని మరికొందరు నెటిజన్లు ప్రశంసిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Next Story