ఆరు రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన ‘అమర్‌నాథ్ యాత్ర’

by Malleboina Mahesh |

ప్రతికూల వాతావరణం కారణంగా గత ఆరు రోజులుగా నిలిచిపోయిన ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్ర శనివారం పునఃప్రారంభమైంది.

ఆరు రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన ‘అమర్‌నాథ్ యాత్ర’
X

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra)ను ప్రభుత్వం తాత్కలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వాతావరణం మారడంతో ఆరు రోజుల విరామం తర్వాత ‘అమర్‌నాథ్ యాత్ర’ తిరిగి ప్రారంభం అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాతావరణం అనుకూలించడంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 6,000 మందికి పైగా భక్తులతో కూడిన కొత్త బృందం కాశ్మీర్ లోయలోని బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.

అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల సాంప్రదాయ పహల్గామ్ మార్గం, గాంధర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల చిన్నదైన బాల్తాల్ మార్గాల్లో వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా యాత్రను ఆపిన అధికారులు, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించారు. ఈ 18వ బృందంలో 1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 54 మంది సాధువులతో కలిపి మొత్తం 6,269 మంది భక్తులు ఉన్నారు. వీరంతా శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు 223 వాహనాల కాన్వాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పవిత్ర అమర్‌నాథ్ గుహ క్షేత్రం వైపు పయనమయ్యారు.

Next Story