- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదంలో చిక్కుకున్న ధృవ్ విక్రమ్.. కోటి రూపాయలు తీసుకొని మోసం చేశాడంటూ ఫిర్యాదు!
ధృవ్ విక్రమ్ మాత్రం మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే రమేష్ వర్మ సినిమా చేస్తానని చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నిర్మాతలు, ధృవ్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ధృవ్ విక్రమ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై నిలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాయి. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం ధృవ్ విక్రమ్ కోటి రూపాయల అడ్వాన్స్ తీసుకుని, తమను మోసం చేశాడని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీగా సెట్లు వేసి, పాటల చిత్రీకరణకు కూడా అధిక మొత్తంలో ఖర్చు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. అంతా సిద్ధమై షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కరణ్ దర్శకత్వంలో రాబోయే తన 'DV4' చిత్రాన్ని ప్రారంభించేందుకు ధృవ్ ఒప్పుకున్నారని వారు పేర్కొన్నారు.
నిజానికి ముందస్తు ఒప్పందం ప్రకారం రమేష్ వర్మ ప్రాజెక్ట్ మొదట DV4గా రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ DV5గా తర్వాత తెరకెక్కాల్సి ఉంది. కానీ ధృవ్ విక్రమ్ మాత్రం మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే రమేష్ వర్మ సినిమా చేస్తానని చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నిర్మాతలు, ధృవ్ తమకు సరైన సమాచారం ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే న్యాయం చేయాలని కోరుతూ తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ విషయంపై ధృవ్ విక్రమ్ అధికారికంగా స్పందిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు.






