పండరీపూర్‌లో వైభవంగా ఆషాఢ ఏకాదశి.. చంద్రభాగా నది తీరంలో లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలు!

by Malleboina Mahesh |

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరీపూర్‌లో ఆషాఢ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.

పండరీపూర్‌లో వైభవంగా ఆషాఢ ఏకాదశి.. చంద్రభాగా నది తీరంలో లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరీపూర్‌లో ఆషాఢ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వార్షిక 'పండరీపూర్ వారి' పాదయాత్ర శనివారంతో పూర్తవ్వడంతో, దేశ నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది వార్కరీ (విఠోబా) భక్తులు చంద్రభాగా నది తీరానికి పోటెత్తారు. పవిత్రమైన ఆషాఢ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ చంద్రభాగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, విఠల నామస్మరణతో పండరీపూర్ క్షేత్రాన్ని మారు మోగించారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్, ముంబై మేయర్ రీతూ తావ్డేలు శ్రీ విఠల-రుక్మిణి ఆలయంలో ప్రత్యేక మహా పూజలు నిర్వహించారు. ఈ ఏడాది భక్తుల రద్దీ మునుపటి రికార్డులన్నింటినీ అధిగమించిందని మంత్రి వెల్లడించారు. కాగా, ఈ యాత్ర సమయంలో పుణే సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాదం మినహా, జూలై 7న ప్రారంభమైన ఈ సుదీర్ఘ పాదయాత్ర లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ ప్రశాంతంగా ముగిసింది.

Next Story