- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ డోస్ పెంచేసిన సిరి హనుమంతు.. స్టన్నింగ్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా
ఆరెంజ్ చీరలో అందాల విందు చేసిన సిరి హనుమంతు.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్, నటి సిరి హనుమంతు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టెలివిజన్ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, అనంతరం పలు టీవీ షోలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని తన అద్భుతమైన ప్రదర్శనతో టాప్-4లో నిలిచి మరింత పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత వరుస టీవీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ప్రస్తుతం సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
తాజాగా విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలు, టీవీ షోలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం సిరి హనుమంతు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆరెంజ్ చీరలో, దానికి జతగా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి సొగసైన పోజులతో కెమెరాకు ఫోజులిచ్చింది.
మెడలో అందమైన హారం, చిన్న ఇయర్‌రింగ్స్, మ్యాచ్ అయ్యే గాజులు, నుదుటిపై చిన్న బొట్టుతో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. విభిన్న యాంగిల్స్‌లో దిగిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






