- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > స్వదేశానికి చేరుకున్న మంత్రి సీతక్క.. ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
స్వదేశానికి చేరుకున్న మంత్రి సీతక్క.. ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
by Kodari Anjali |
మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (TTA) వారి ఆధ్వర్యంలో అమెరికాలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన మంత్రి అక్కడి కార్యక్రమం ముగీయగానే స్వదేశానికి పయనమయ్యారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేగ కళ్యాణి, మండల పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు సీతక్క కు ఘనంగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






