- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెంతనే సీతారామ ఉన్న ఊర చెరువు ఆయకట్టుకు సాగునీరు సున్నా
ఏన్కూర్ మండలానికి గోదావరి జలాలు వస్తున్నాయి.

దిశ, ఏన్కూర్: ఏన్కూర్ మండలానికి గోదావరి జలాలు వస్తున్నాయి. రైతులు కాలువ నిర్మాణానికి భూములు ఇవ్వాల్సి ఉంది. భూములు ఇస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. అని రైతులను నయానా భయానా ఇబ్బందులకు గురిచేసి, రైతుల దగ్గర నుండి భూములు తీసుకొని, రైతులకు నష్టపరిహారం అందజేసి సీతారామ ప్రాజెక్టును నిర్మాణం చేయడంలో జిల్లా మంత్రివర్యులు సఫలీకృతం అయ్యారు. ఈ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఊర చెరువులతోపాటు, మేజర్ కాలవల ద్వారా రైతుల పొలాలకు సాగునీరు అందుతుందని ఎంతో ఆశపడ్డారు. తీర ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి. గోదావరి జలాలను సాగర కాలవలో కలిపి ఆంధ్రప్రాంతానికి సాగు నీరు వెళ్లే విధంగా జిల్లా మంత్రివర్యులు పనిచేయడం ఎంతవరకు సబబు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏన్కూర్ ఊర చెరువు, గార్ల ఒడ్డు ఊర చెరువు, టి ఎల్ పేట చెరువు, నాచారం చెరువు, తో పాటు పలు చెరువులకు మేజర్ కాలువల ద్వారా గోదావరి జలాలను నింపే చర్యలు చేపట్టవు పోవడం రైతులు నిరాశకు గురిచేస్తుంది. వైరా శాసనసభ్యుడు మాలోతు రామదాసు నాయక్, ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి, భూములు ఇచ్చిన ఈ రైతులకు సాగునీరందే విధంగా, గోదావరి జలాలతో ఊర చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరుతున్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందనంగా, తెలంగాణ నిధులతో నిర్మాణం జరిగిన సీతారామ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.






