ఢిల్లీ నిరసనల్లో 130 పోలీసులకు గాయాలు.. 15 FIRలు నమోదు

by Malleboina Mahesh |

ఢిల్లీ నిరసనల్లో 130 మంది పోలీసు సిబ్బంది గాయపడగా,15 FIRలు నమోదయ్యాయని, FRS) కెమెరాల క్రిమినల్ రికార్డులు కలిగిన 2000 మందిని గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు.

ఢిల్లీ నిరసనల్లో 130 పోలీసులకు గాయాలు.. 15 FIRలు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వేదికగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ నిరసనలపై పోలీసు వర్గాలు కీలక సమాచారం అందించాయి. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 130 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 15 FIRలు నమోదయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు, నిరసనల్లో సుమారు 65 మంది విద్యార్థులు కూడా గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

జంతర్ మంతర్ వద్ద, చుట్టుపక్కల సగటున 10,000 మంది ప్రజలు ఉన్నారని, అక్కడ 3000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే సంఘ వ్యతిరేక శక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాల సహాయం తీసుకుంటున్నారు. ఈ సాంకేతికత ద్వారా ఇప్పటివరకు క్రిమినల్ రికార్డులు కలిగి ఉండి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన 2000 మందికి పైగా వ్యక్తులను పోలీసులు గుర్తించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Next Story