కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దక్కించుకున్న శివానీ రాజశేఖర్.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |

తెలుగులో తనదైన ఆభినయంతో ఆకట్టుకున్న శివానికి తమిళంలో ఇది మూడో చిత్రం కావడం విశేషం.

కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దక్కించుకున్న శివానీ రాజశేఖర్.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె, యంగ్ టాలెంటెడ్ నటి శివాని రాజశేఖర్ ‘2స్టేట్స్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయి ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును రాబట్టుకున్నారు. కానీ సరైన హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేకపోయారు. నటిగానే కాకుండా నిర్మతగానూ వ్యవహరించిన ఈ భామ త్వరలో ‘జీడిఎన్ నాయుడు’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. జీడీ నాయుడు బయోపిక్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఆర్.మాధవన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 7న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శివాని రాజశేఖర్ తమిళ చిత్రసీమలో మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకున్నారు. షణ్ముగ పాండియన్ హీరోగా, విలక్షణ దర్శకుడు తిరు కాంబినేషన్‌లో రాబోతున్న ‘వానవేడికై’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తాజాగా మేకర్స్ శివాని ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమెకు స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను షేర్ చేశారు. తెలుగులో తనదైన ఆభినయంతో ఆకట్టుకున్న శివానికి తమిళంలో ఇది మూడో చిత్రం కావడం విశేషం.

2022లో వచ్చిన 'అన్బరివు', 'నెంజుకు నీధి' చిత్రాల ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇప్పుడు 'వానవేడికై'తో అక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తెలుగులో రాహుల్ విజయ్ సరసన 'విద్య వాసుల అహం' చిత్రంలో మెప్పించిన శివాని, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని కెప్టెన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎల్.కె. సుధీష్ నిర్మిస్తున్న ఈ 9వ ప్రతిష్టాత్మక చిత్రంలో శివాని పాత్ర ఎంతో కీలకమైనదిగా ఉండబోతోందని సమాచారం. విశాల్‌తో 'తీరాద విళైయాట్టు పిళ్ళై', 'సమర్' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తిరు ఏడేళ్ల విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని నటించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో శివాని రాజశేఖర్ కోలీవుడ్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story