చైనాలో మొట్టమొదటి ఏఐ హాస్పిటల్! ఏఐ డాక్టర్లు.. వర్చువల్ నర్సులు! అక్యురసీతో ట్రీట్‌మెంట్

by Ramesh Naini |

ఏఐ రంగంలో మరో విప్లవాత్మకమైన అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేథస్సుతో పనిచేసే హాస్పిటల్‌ను క్రియేట్ చేశారు.

చైనాలో మొట్టమొదటి ఏఐ హాస్పిటల్! ఏఐ డాక్టర్లు.. వర్చువల్ నర్సులు! అక్యురసీతో ట్రీట్‌మెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐ రంగంలో మరో విప్లవాత్మకమైన అడుగుపడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేథస్సు (Artificial Intelligence)తో పనిచేసే (AI hospital) హాస్పిటల్‌ను రూపొందించారు. ఏజెంట్ హాస్పిటల్ (Agent Hospital) అనే వర్చువల్ ఆసుపత్రిని చైనాలోని ప్రముఖ సింఘువా విశ్వవిద్యాలయం (Tsinghua University) పరిశోధకులు అభివృద్ధి చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏఐ హాస్పిటల్‌లో 14 మంది ఏఐ డాక్టర్లు (AI doctors), నలుగురు వర్చువల్ నర్సులుగా ఉన్నాయి. చాట్ జీపీటీ 3.5 టెక్నాలజీ ఉపయోగించి ఏఐ రోబోలు డాక్టర్ల పాత్రను పోషిస్తున్నాయి. ఈ హాస్పిటల్‌లో అత్యవసర వైద్యం, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీ వంటి 21 విభాగాలు సైతం ఉన్నాయి.

వేగం, కచ్చితత్వం ఈ ఏఐ డాక్టర్ల ప్రత్యేకత. ఈ ఏడాది చివర్లో ఏఐ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. మానవ డాక్టర్లు సాధారణంగా చూపించే అక్యురసీ 82 నుంచి 85 శాతం మాత్రమే ఉంటుంది.. కానీ ఏఐ డాక్టర్లు చేసే ట్రీట్‌మెంట్ అక్యురసీ 93 వరకు ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు. అదేవిధంగా దాదాపు పదివేల మందికి కొన్ని రోజుల్లోనే ట్రీట్‌మెంట్ చేసే కేపాసిటీ ఈ ఏఐ డాక్టర్లకు ఉందని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. మానవ డాక్టర్లకు ఇలా చేయాలంటే రెండేళ్లు పడుతుందట. ఇది సక్సెస్ అయితే ఇక అభివృద్ధి చెందిన వేరే దేశాల్లో సైతం ఇలాంటి హస్పిటల్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ డాక్టర్లు మరింత అభివృద్ధి చెందితే.. కొన్నేళ్ల తర్వాత మానవ డాక్టర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి.

Next Story