చైనా రహస్య క్యాంపుల్లో ఏం జరుగుతోంది? 20లక్షల మంది నిర్బంధం నిజమేనా? ముస్లింలపై ఇంత క్రూరత్వమా?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-29 11:43:28  IST  )

చైనా ముస్లింల సంఖ్యను తగ్గించేందుకు క్రూరంగా వ్యవహరిస్తుందనే వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉయ్ఘర్, తుర్కిక్ మైనార్టీలను అణిచివేసేందుకు జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుందని.. కాన్సంట్రేషన్ క్యాంపుల పేరుతో ముస్లింలను మతం మారేందుకు ఒత్తిడి చేస్తోందని, ఈ క్రమంలో

చైనా రహస్య క్యాంపుల్లో ఏం జరుగుతోంది? 20లక్షల మంది నిర్బంధం నిజమేనా? ముస్లింలపై ఇంత క్రూరత్వమా?
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా ముస్లింల సంఖ్యను తగ్గించేందుకు క్రూరంగా వ్యవహరిస్తుందనే వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉయ్ఘర్, తుర్కిక్ మైనార్టీలను అణిచివేసేందుకు జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుందని.. కాన్సంట్రేషన్ క్యాంపుల పేరుతో ముస్లింలను మతం మారేందుకు ఒత్తిడి చేస్తోందని, ఈ క్రమంలో దారుణమైన చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20లక్షల మందిని ‘వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలు’ అనే పేరుతో నడుపుతున్న నిర్బంధ స్థలాలకు తరలిస్తుందని తెలుస్తోంది. దీనిపై మానవ హక్కుల సంస్థలు, ఐక్య రాజ్య సమితి, ప్రపంచ దేశాలు వ్యతిరేక స్వరాన్ని వినిపించినా.. తాము చేస్తుందని పేదరిక నిర్మూలన కార్యక్రమం అని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది చైనా.

మత మార్పిడి నిజమేనా?

* నిజానికి పద్దెనిమిది ఏళ్లుగా 20లక్షల మంది ముస్లింలను క్యాంపుల్లో బంధించారు. శ్రమ దోపిడీ చేస్తూ.. మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

* ఇక క్యాంపుల వెలుపల మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేయడం, ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలను కనడం, ఖురాన్‌ పఠించడం, సందేశాలను పంపుకోవడం వంటివి జరగకుండా పూర్తి నిఘా పెట్టింది.

* ముస్లింలను గుర్తించేందుకు డీఎన్ఏ సేకరణ కోసం వారి ఇళ్లలోనే ప్రభుత్వాధికారులను నివసించేలా చర్యలు తీసుకుంది.

క్యాంపుల్లో క్రూరత్వం

* ఇక ఉయ్ఘర్‌లను గుర్తించాక వారిని ఈ విద్యా కేంద్రాలు అని పిలువబడే క్యాంపులకు తరలించి చిత్రహింసలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ విశ్వాసాలను త్యజించాలని క్రూరంగా దాడులు చేయడం, ఒంటరిగా నిర్బంధించడం, నిద్ర లేకుండా చేయడం వంటివి ఉంటాయని ఇంతకు ముందు ఈ శిక్షలను అనుభవించినవారు తెలిపినట్లు సమాచారం.

* ఇక మహిళలపై లైంగిక హింస, అత్యాచారం జరుగుతుందని.. వారికి పిల్లలు పుట్టకుండా, ముస్లింల జనాభా పెరగకుండా చికిత్సలు జరుగుతాయని నివేదిక.

* బంధించబడిన వారు కచ్చితంగా మాండరిన్ నేర్చుకోవాల్సిందే. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయాల్సిందే. వారి మతపరమైన, సాంస్కృతిక ఆచారాలను వదిలేయాల్సిందే. లేదంటే శిక్షలు మరింత క్రూరంగా అమలు చేయబడుతాయి.

బలవంతపు శ్రమ దోపిడి

* క్యాంపుల్లో శిక్షలు తట్టుకోలేక మతం మారుతామని, విధేయులుగా ఉంటామని ఒప్పుకున్న వారిని అక్కడి నుంచి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని.. వారి శ్రమను దోచుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ సంస్థల వాదన. ఫ్యాక్టరీల్లో టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి వస్తువులను ఉత్పత్తి చేయిస్తున్నారని తెలుస్తోంది.

* చైనా ప్రభుత్వం ఉయ్ఘర్ కల్చర్, రిలీజియస్ ప్లేస్‌లను ధ్వంసం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కాశ్గర్‌లో 70% కంటే ఎక్కువ మసీదులను కూలగొట్టడం, స్మశానవాటికలను అపవిత్రం చేయడం ఇందులో భాగమే.

* ఉయ్ఘర్లను హాన్ చైనీస్ కల్చర్‌లో ఇమిడిపోవడానికి ఇస్లామిక్ పేర్లు విడిచిపెట్టాలని, హలాల్ మాంసం, రంజాన్ ఉపవాసం వంటి ఆచారాలకు వ్యతిరేక విధానాలను తీసుకొచ్చింది.

ప్రపంచ దేశాల స్పందన.. చైనా సమాధానం

* ఈ బలవంతపు మత మార్పిడి, నిర్బంధం, హింస విషయంలో ప్రపంచ దేశాలు చైనాను తప్పు పట్టాయి. యునైటెడ్ స్టేట్స్, యూకే, కెనడా వంటి దేశాలు ఈ చర్యను మానవత్వానికి మచ్చగా వర్ణించాయి. కానీ రష్యా, సౌదీ అరేబియా, వెనిజులా వంటి దేశాలు మాత్రం చైనా చర్యలను సమర్థించాయి. తీవ్రవాద నిరోధక చర్యగా అభివర్ణించాయి. మరోవైపు చైనా ప్రభుత్వం ఈ కాన్సంట్రేషన్ క్యాంపులను తీవ్రవాదం, పేదరికాన్ని ఎదుర్కోవడానికి శిక్షణ కేంద్రాలుగా తెలిపింది.

Next Story