- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tax War: ముదురుతున్న వివాదం.. అమెరికాకు భారీ షాకిచ్చిన చైనా
అమెరికా(America) సుంకాలపై చైనా(China) ప్రతీకార చర్యలు ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) సుంకాలపై చైనా(China) ప్రతీకార చర్యలు ప్రారంభించింది. అమెరికాకు భారీ షాకిచ్చేలా ఆ దేశ వస్తులపై 34 శాతం ఉన్న సుంకాన్ని 84 శాతానికి పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇప్పటికే చైనా వస్తులవులపై అమెరికా 104 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యలతో చైనా-అమెరికా మధ్య మరింత సుంకాల యుద్ధం(Tax War) ముదిరినట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రకటించిన టారీఫ్‌లపై మండిపడ్డ చైనా ముందుగా ఆమెరికా వస్తులపై 34శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో చైనా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్ ఏప్రిల్ 8వ తేదీలోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. అయినా చైనా నిర్ణయంలో మార్పు లేకపోవడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి పెంచారు. ఇవి ఏప్రిల్ 9 నుంచే అమలు చేయాలని పక్కా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అమెరికా ప్రతీకార సుంకాలపై స్పందించిన చైనా.. ఆమెరికా వస్తువులపై ఉన్న 34 శాతం సుంకాలను 84శాతానికి పెంచారు.






