ఢిల్లీ జీ20 సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి

by S Gopi |

ఈ నెల 2న జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా మంత్రి హాజరుకానున్నారు. గురువారం దేశరాజధాని....China foreign minister Qin Gang to attend G-20 meet in Delhi: Report

ఢిల్లీ జీ20 సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి
X

న్యూఢిల్లీ: ఈ నెల 2న జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా మంత్రి హాజరుకానున్నారు. గురువారం దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హజరుకానున్నట్లు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. జీ20 సమావేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధాన దృష్టి పెట్టింది. జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం బహుపాక్షికతపై సానుకూల సంకేతం పంపేలా అన్ని పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రత్యక్ష పద్ధతిలో విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ20కి థీమ్‌గా వసుధైవ కుటుంబం ఉంది. కాగా, తూర్పు లఢఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆ దేశ మంత్రి భారత్‌కు రానుండడం ఆసక్తికరంగా మారింది.

Next Story