- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రాగన్ కంట్రీలో జనాభా సంక్షోభం.. గణనీయంగా తగ్గిన సంతానోత్పత్తి
డ్రాగన్ కంట్రీ చైనాలో వరుసగా నాలుగో సంవత్సరం జననాల రేటు గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇది అక్కడ జనాభా సంక్షోభానికి దారితీస్తుందన్న ఆందోళన మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: డ్రాగన్ కంట్రీ చైనాలో వరుసగా నాలుగో సంవత్సరం జననాల రేటు గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇది అక్కడ జనాభా సంక్షోభానికి దారితీస్తుందన్న ఆందోళన మొదలైంది. ఒకప్పుడు జనాభాలో ప్రపంచంలో అన్ని దేశాలకంటే చైనా టాప్ లో ఉండేది. కానీ గతేడాది జులై1 జనాభా లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల లిస్టులో భారత్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. చైనా రెండోస్థానానికి పడిపోయింది. 2022లో చైనా మొదటి స్థానంలో ఉండగా.. మూడేళ్లుగా రెండోస్థానంలోనే కొనసాగుతోంది. 2024లో నమోదైన జనాభా సంఖ్యతో పోలిస్తే 2025లో జననాల సంఖ్య 17 శాతం తక్కువగా నమోదైందని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది అక్కడ జననాల సంఖ్య 79.2 లక్షలుగా నమోదయింది. ఆసియా ఖండంలో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే.. చైనాలో సంతానోత్పత్తి రేటు రోజురోజుకూ తగ్గుతోందని, ఇది దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.
చైనాలో పిల్లల్ని కనేందుకు జంటలు వెనుకాడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. అక్కడి ప్రజల జీవన ఖర్చులు పెరగడమే. పిల్లల పెంపకం చాలా ఎక్స్పెన్సివ్ కావడంతో కనకపోవడమే మంచిదని భావిస్తున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ చదువుకి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు సరాసరి 76 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.69 లక్షలు ఖర్చవుతున్నట్లు ఒక అంచనా ఉంది. అందుకే పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. పెళ్లయిన వాళ్లు పిల్లల్ని కనాలంటే ఖర్చు గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ధోరణిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే కండ్రోమ్స్, గర్భనిరోధక మాత్రలపై 13 శాతం పన్ను విధించింది. నర్సరీ నుంచి కిండర్ గార్టెన్స్ వరకూ, వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలు.. వంటివాటిపై ఈ ఏడాది జనవరి 1 నుంచి పన్నును మినహాయించింది.






