- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Make in India': ‘మేకిన్ ఇండియా’తో భారత్ కంటే చైనాకే ఎక్కువ లాభం: రాహుల్ గాంధీ
మేకిన్ ఇండియా (Make in India) ప్రోగ్రాం వల్ల భారత్ కంటే ఎక్కువగా చైనానే లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మేకిన్ ఇండియా (Make in India) ప్రోగ్రాం వల్ల భారత్ కంటే ఎక్కువగా చైనానే లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. భారత్ తో తయారీ రంగం వెనకబడటంతో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ప్రముఖ నెహ్రూ ప్లేస్’లో రాహుల్ గాంధీ పర్యటించారు. అక్కడ టెక్నిషీయన్లతో కాసేపు మాట్లాడారు. దీన్ని ఎక్స్ లో పోస్టు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ అనేక ప్రశ్నలు సంధించారు. చైనా నుంచి దిగుమతులు రెండు రెట్లు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ‘మేకిన్ ఇండియా’ లో ఫ్యాక్టరీలలో ఉత్పత్తులు అమాంతం పెరుగుతున్నాయని చెబుతున్నా నిరుద్యోగం ఎందుకు పెరుగుతోందని అడిగారు.
మోదీ నినాదాలు మాత్రమే చెబుతారు.. పరిష్కారాలు చూపరు
ప్రధాని మోదీ కేవలం నినాదాలకే పరిమతం అవుతారని పరిష్కారాలు చూపరని రాహుల్ గాంధీ విమర్శించారు. 2014 నుంచి భారత్ లో తయారీ రంగం పడిపోయిందని కేవలం 14 శాతానికే పరిమితమైందని ఆరోపించారు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందన్నారు. భారత్ లో వస్తువులను అసెంబ్లింగ్ మాత్రమే చేసుకుంటున్నామని, వాటిని తయారు చేయడం లేదని అన్నారు. అందుకే చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రొడక్ట్ తయారీ ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం మెల్లిగా వెనక్కి తీసుకుంటుందని ఆరోపించారు. తయారీ రంగంలో కచ్చితంగా సంస్కరణలు అవసరమని సూచించారు. ఇక్కడ మనం మార్కెట్ గా ఉండకూడదు. మనం కూడా తయారీ రంగంలో ఎంతో దూసుకుపోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.






