జాతీయ రహదారుల్లో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ కు కేంద్రం ఓకే

by Shamantha N |   (  Updated:2025-06-18 09:07:59  IST  )

జాతీయ రహదారుల ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్ ను కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది

జాతీయ రహదారుల్లో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ కు కేంద్రం ఓకే
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ రహదారుల ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్ ను కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ యాన్యువల్ పాస్ రూ. 3 వేలు ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ లో చేసిన పోస్టులో తెలిపారు. ఏడాది పాటు 200 ట్రిప్పులు పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, నాన్ కమర్షియల్ వెహికల్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల్లో ఈ యాన్యువల్ పాస్ పనిచేస్తుందని తెలిపారు.

యాక్టివేషన్ కోసం త్వరలో లింక్

ఈ యాన్యువల్ పాస్ యాక్టివేషన్ కోసం రాజ్ మార్గ్ యాప్ తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్లలో త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తేనున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. చాలా కాలంగా యాన్యువల్ పాస్ విషయంలో ప్రయాణికులు ఒత్తిడి తీసుకువచ్చారు. వారందరికి సంబంధించి ఉన్న వివిధ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని యాన్యువల్ పాస్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ యాన్యువల్ పాస్ వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులకు ఉపయోగపడనుందని పేర్కొన్నారు.

Next Story