- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ పొడిగింపు
by velandi.Saikiran |
ఇజ్రాయెల్, లేబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, లేబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో 45 రోజుల పాటు సీజ్ ఫైర్ కు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 2 రోజులు వాషింగ్టన్ లో ఇరు దేశాల మధ్య చర్చలు జరగగా.. అవి ఫలవంతంగా సాగాయని వెల్లడించింది.
జూన్ 2-3 తేదీలలో మరోసారి చర్చలు తిరిగి ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్. ఏప్రిల్ 16వ తేదీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికీ చాలా దేశాల్లో చమురు, ఎల్పీజీ కొరత కొనసాగుతూనే ఉంది. మన ఇండియాలో కూడా చమురు ధరలు అమాంతం పెంచేశారు.
Next Story






