ఇండియ‌న్ కుటుంబాల‌కు బిగ్ రిలీఫ్‌..కెన‌డా సంచ‌ల‌న నిర్ణ‌యం !

by velandi.Saikiran |

తమ పిల్లలు పుట్టకముందు కనీసం 3 ఏళ్లు సంవత్సరాలు అంటే 1095 రోజులు కెనడాలో ఆ తల్లిదండ్రులలో ఎవరో ఒకరు

ఇండియ‌న్ కుటుంబాల‌కు బిగ్ రిలీఫ్‌..కెన‌డా సంచ‌ల‌న నిర్ణ‌యం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పౌరసత్వ రూల్స్ లో పలు మార్పులు చేసి, అమలు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది కెనడా. ఈ మార్పుల వల్ల విదేశాల్లో జన్మించిన కెనడియన్లకు అదే సమయంలో ఇండియా సంతతి కుటుంబాలకు కూడా వారికి రిలీఫ్ దక్కనుంది. ఇందులో భాగంగానే బిల్ సీ-3 ను కెనడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ ప్రకారం విదేశాల్లో జన్మించినా, దత్తత తీసుకున్న పిల్లలు ఉన్న ఫ్యామిలీలకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా 2009లో ఫస్ట్ జనరేషన్ లిమిట్ అనే రూల్ తీసుకువచ్చింది కెనడా సర్కార్.

ఈ రూల్ ప్రకారం కెనడాలో పుట్టని, ఒక కెనడియన్ వ్యక్తి... తమకు విదేశాల్లో పుట్టిన పిల్లలకు మాత్రం పౌరసత్వాన్ని అందించబోరన్నమాట. కానీ పేరెంట్స్ లో కనీసం ఒక్కరు కెనడాలో కచ్చితంగా జన్మించాలి. అలా అయితేనే పౌరసత్వం ఇచ్చేవారు. దీనివల్ల చాలామంది పౌరసత్వాన్ని కోల్పోయారు. ఇలాంటి వాళ్లను లాస్ట్ కెనడియన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఆ రూల్ కు చెక్ పెట్టి, సవరణల దిశగా అడుగులు వేస్తోంది కెనడా. ఇకపైన కెనడాలో పుట్టకపోయినా పౌరసత్వం కలిగిన తల్లి లేదా తండ్రి...ఈ దేశంలో కొన్ని రోజుల పాటు నివ‌సించాలి.

తమ పిల్లలు పుట్టకముందు కనీసం 3 ఏళ్లు సంవత్సరాలు అంటే 1095 రోజులు కెనడాలో ఆ తల్లిదండ్రులలో ఎవరో ఒకరు నివసించి ఉన్నట్లు ప్రూఫ్స్ చూపించాలి. అప్పుడు వాళ్లకు పుట్టబోయే పిల్లలకు లేదా దత్తత తీసుకున్న వాళ్లకు కెనడా పౌరసత్వం వస్తుందన్న మాట‌. ఇప్పటికే యూఎస్ఏ, UK అలాగే ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఈ రూల్స్ అమలులో ఉన్నాయి. ఇకపై కెనడాలో కూడా అమ‌లులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే, భారత సంతతి కుటుంబాలకు దాదాపు 10వేల కుటుంబాల‌కు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. క్లిక్

Next Story