- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శవాలపై చిల్లర ఏరుకోవడమంటే ఇదేనేమో?
అమెరికాలో మానవ మాంసం రవాణా వ్యాపారం పెరుగుతోంది. బ్లాక్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని.. మానవ అవయవాల అక్రమ రవాణాను మసిపూసి మారేడు కాయను చేస్తున్నారు. పరిశోధనల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో మానవ మాంసం రవాణా వ్యాపారం పెరుగుతోంది. బ్లాక్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని.. మానవ అవయవాల అక్రమ రవాణాను మసిపూసి మారేడు కాయను చేస్తున్నారు. పరిశోధనల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు భారీ మొత్తంలో పెరగ్గా.. తాము వైద్య విద్య కోసం దీన్ని ఉపయోగిస్తున్నామని చెప్తున్నాయి. కానీ దీని వెనుక చీకటి కోణం కూడా ఉందని పరిశోధనలు చెప్తున్నాయి.
అధ్యయనం ఏం చెప్తుంది?
నిజానికి యూఎస్‌లో హ్యూమన్ ఆర్గాన్స్ అమ్మకం చట్టవిరుద్ధం. కానీ ప్రాసెసింగ్, సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్ట్ పేరుతో ట్యాక్స్ వసూల్ చేయడం మాత్రం చట్టబద్ధమే. దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి. అనేక ప్రైవేట్ కంపెనీలు. ఈ లొసుగుతోనే లాభాలు పొందుతున్నాయి. 2017లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 25కు పైగా యూఎస్ కంపెనీలు మృతదేహాలు, అవయవాల అమ్మకం ద్వారా లక్షల కోట్లు సంపాదించాయి. 2011-15 మధ్య కాలంలో 50వేల శవాలు, లక్షా ఎనభై వేల అవయవాలను రవాణా చేశాయి.
మరోవైపు యూనివర్సిటీలు, వైద్య పరిశోధన కేంద్రాలకు తగినన్ని మృతదేహాలు లేకపోయేసరికి.. ఈ వ్యాపారానికి భలే డిమాండ్ పెరిగింది. ఈ కొరతను తీర్చేందుకు ప్రైవేట్ సంస్థలు.. ఉచితంగా దహన సంస్కారాలు చేస్తామని మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. వాటిని అవయవాలుగా డివైడ్ చేసి అమ్ముకుంటున్నాయి. పర్యవేక్షణ లోపం, సరైన నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి సమయాల్లో వ్యతిరేకించిన వారి కుటుంబీకులకు వేధింపులు కూడా తప్పడం లేదు. ఇక నిరాశ్రయులు, బంధువులు లేని ఒంటరి వారి మృతదేహాల గురించి ప్రశ్నించే నాథుడే లేడు.






