భారీ భూకంపం.. నేలకూలిన భారీ భవనాలు

by Malleboina Mahesh |

పశ్చిమ తుర్కియేలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

భారీ భూకంపం.. నేలకూలిన భారీ భవనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవిస్తున్నాయి. గత నెల రోజులుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుస భూకంపాలతో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున పశ్చిమ తుర్కియే (Western Turkey)లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపణల (Earthquakes) ధాటికి.. బల్కేసర్ సిందిర్గి ప్రాంతంలో భారీ భవనాలు కుప్పకూలిపోయాయి (buildings collapsed.). దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ భూకంపం వచ్చినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలలో భూకంప ప్రకంపణల తీవ్రత స్పష్టంగా కనిపించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నేలమట్టం అయిన భవనాల వద్ద రెస్క్యూ అపరేషన్లు వేగంగా కొనసాగుతున్నాయి.

Next Story