Iryna Zarutska: అమెరికాలో ఉక్రెయిన్ శరణార్థి దారుణ హత్య.. ట్రంప్ ఆలస్య స్పందనపై విమర్శలు

by Ramesh Naini |

రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్ధిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి దుండగుడు చంపేశాడు.

Iryna Zarutska: అమెరికాలో ఉక్రెయిన్ శరణార్థి దారుణ హత్య.. ట్రంప్ ఆలస్య స్పందనపై విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. రైల్లో ప్రయాణిస్తున్న (Ukrainian refugee) ఉక్రెయిన్ శరణార్ధిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి దుండగుడు చంపేశాడు. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్‌ల యుద్ధం కారణంగా 23 ఏళ్ల ఇరీనా జరుట్‌స్కా (Iryna Zarutska) అనే మహిళ ఆమెరికాకు వచ్చి స్థిరపడాలని భావించింది. ఎన్నో ఆశలతో జీవించాలని వచ్చిన ఆ మహిళ ఒక దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది.

ఆగస్టు 22న రాత్రి 9 గంటల ప్రాంతంలో లైట్ రైల్ ఎక్కిన ఆమె ఒక ఖాళీ సీట్లు కూర్చోని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆదే సమయంలో ఆమె వెనుక సీట్లో కూర్చోని ఉన్న 34 ఏళ్ల డెకార్లోస్ బ్రౌన్ ఆనే దుండగుడు కత్తితో ఆమె మెడపై మూడు సార్లు పొడిచి చంపాడు. రైలులో ఇతర ప్రయాణికులు అందరూ చూస్తుండగానే రక్తం కారుతున్న కత్తితో రైలు దిగి తన దారిలో నిందితుడు వెళ్లిపోతాడు. ఇక తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నేర చరిత్ర కలిగిన నిందితుడు డెకార్లోస్ బ్రౌన్‌ను సీసీకెమరాల ద్వారా పోలీసులు కనిపెట్టి అదుపులోకి తీసుకోని.. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కానీ అతడు ఆమె దాడికి పాల్పడిన కారణాలను పోలీసులు తెలుసుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Trump) స్పందించారు. తాజాగా మేరిల్యాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ట్రంప్ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతారు. ‘భయంకరమైన ఘటన.. రేపు ఉదయం నాటికి నాకు దాని గురించి పూర్తిగా తెలుస్తుంది’ అని ఆయన స్పందించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్‌లు మండిపడ్డారు. ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి? గత కొన్ని రోజులుగా ఈ ఘటన ట్రెండ్ అవుతుంటే అని నెటిజన్‌లు విమర్శించారు. ట్రంప్ స్పందన లింక్..

Next Story