- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: ఇరాక్‌లోని బాగ్దాద్‌లో దారుణం.. టిక్‌టాక్ స్టార్ ఓం ఫహద్ దారుణ హత్య
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రసిద్ధ ఇరాకీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాక్ స్టార్ ఓం ఫహద్ శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాక్‌లోని బాగ్దాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రసిద్ధ ఇరాకీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాక్ స్టార్ ఓం ఫహద్ శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. జయోనా జిల్లాలో నివాసం ఉంటున్న ఓం ఫహాద్ ఇంటికి గుర్తు తెలియని దుంగుగులు బైక్‌పై వచ్చారు. అనంతరం ఫుడ్ డెలీవరీ చేస్తున్నట్లుగా యాక్ట్ చేస్తూ.. ఉన్నట్టుండి ఫహద్‌పై తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె రక్తపు మడుగలో పడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె హత్య జరిగిన ప్రాంతంలోనే ఇరాక్‌కు చెందిన సుప్రసిద్ధ భద్రతా నిపుణుడు, పరిశోధకుడు హిషామ్ అల్-హషిమిని 2020లో దుండగులు కాల్చి చంపడం గమనార్హం.
కాగా, ఓం ఫహద్ ఇరాకీ సంగీతానికి డ్యాన్స్ చేస్తున్న వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడం ద్వారా అనతికాలంలోనే ఆమె స్టార్‌గా ఎదిగగారు. ఫిబ్రవరి 2023లో ప్రజా నైతికతను అణగదొక్కే అసభ్య ప్రసంగం ఉన్న వీడియోలను షేర్ చేసినందుకు గాను కోర్టు ఆమెకు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా విధించింది.






