కేరళ ఎయిర్ పోర్టులోనే 10 రోజులుగా నిలిచిన బ్రిటిష్ F 35 ఫైటర్ జెట్

by Shamantha N |   (  Updated:2025-06-25 06:33:53  IST  )

జూన్ 14న అత్యవసరంగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్ 10 రోజులుగా నిలిచిపోయింది.

కేరళ ఎయిర్ పోర్టులోనే 10 రోజులుగా నిలిచిన బ్రిటిష్ F 35 ఫైటర్ జెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: జూన్ 14న అత్యవసరంగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్ 10 రోజులుగా నిలిచిపోయింది. యూఎస్ డాలర్లు 110 మిలియన్ల ఖరీధైన అత్యంత అధునాతన ఫైటర్ జెట్ అయిన ఎఫ్ 35 అత్యవసర ల్యాండింగ్ కోరగా ఎయిర్ పోర్టు అనుమతించింది. మొదట తక్కువ ఇంధనం ఉందని అత్యవసర ల్యాండింగ్ అవసరమని సంకేతాలు ఇచ్చింది. అయితే ఫైటర్ జెట్ లో హైడ్రాలిక్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు దీంతో టేకాఫ్ చేయలేకపోతున్నట్లు గుర్తించారు. దీంతో ఫైటర్ జెట్ ను బే 4 వద్ద నిలిపి, (CISF) సిబ్బంది కాపలాగా ఉన్నారు. కేరళలో వర్షాలు పడుతుంటంతో దీనిని హ్యాంగర్‌కి తరలించాలన్న భారత అధికారుల ప్రయత్నాన్ని రాయల్ నేవీ తిరస్కరించింది.

హైడ్రాలిక్ సమస్యలే కారణమా?

ఈ బ్రిటిష్ F-35B జెట్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో విన్యాసాల్లో పాల్గొంటోంది. జెట్ తక్షణ సహాయం అవసరమన్న సంకేతంగా SQUAWK 7700 ట్రాన్స్‌పాండర్ కోడ్ ప్రసారం చేసినట్టు సమాచారం. భారత వైమానిక దళం అన్ని అవసరమైన టెక్నికల్ గా సహాయం అందించినప్పటికీ, హైడ్రాలిక్ సమస్యల వల్ల జెట్ మళ్లీ ఎగరలేకపోయింది. గ్రౌండ్‌లో జెట్‌ను మరమ్మతు చేయలేకపోయిన బ్రిటిష్ టెక్నికల్ నిపుణులు చివరికి దాన్ని UKకి సైనిక రవాణా విమానంలో పంపించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. కాగా ఇంత అత్యంత అధునాతన ఫైటర్ జెట్ లో సమస్యలు తలెత్తడంతో బ్రిటిష్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే F౩5 షార్ట్ టేకాప్, వర్టికల్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యమున్న అత్యంత అధునాతన ఫైటర్ జెట్ ఇది. వీటిని నాటో సభ్యదేశాలు ఉపయోగిస్తున్నాయి.

Next Story