Kohinoor daimond: భారత్‌కు కోహినూర్ వజ్రం..బ్రిటన్ మంత్రి క్లారిటీ

by Ajay Maddhiboyina |

మ‌న దేశ‌ కోహినూర్ వ‌జ్రం బ్రిట‌న్ రాణి కిరీటంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే దానిని తిరిగి ఇస్తారా అంటూ బ్రిటన్ మంత్రి లీసా నాండీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

Kohinoor daimond: భారత్‌కు కోహినూర్ వజ్రం..బ్రిటన్ మంత్రి క్లారిటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌న దేశ‌ కోహినూర్ వ‌జ్రం బ్రిట‌న్ రాణి కిరీటంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే దానిని తిరిగి ఇస్తారా అంటూ బ్రిటన్ మంత్రి లీసా నాండీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె సమాధానం ఇస్తూ.. భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక క‌ళా కండాల మార్పిడి కోసం ఉన్న‌త స్థాయిలో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. అన్నీ అనుకూలంగా జ‌రిగితే అంద‌రికీ ఆమోద‌యోగ్యం అయ్యే నిర్ణ‌యం రావచ్చ‌ని చెప్పారు. ఇదే విష‌యంపై భార‌త మంత్రిత్వ‌శాఖ మంత్రితో కూడా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు.

సృజ‌నాత్మ‌క‌, సాంస్కృతిక మరియు క్రీడా రంగాల్లో భార‌త్ భాగ‌స్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు లీసా స్ప‌ష్టం చేశారు. సినిమా, మ్యూజిక్, టీవీ రంగాల‌లో బ్రిట‌న్ దూసుకుపోతోంద‌ని ఆయా రంగాల్లో బ్రిట‌న్ కు ప్ర‌పంచస్థాయిలో గుర్తింపు ఉంద‌ని చెప్పారు. భార‌త్ స‌హ‌క‌రిస్తే వాటిని మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌చ్చు అనే న‌మ్మకం ఉంద‌న్నారు. భార‌త్ కూడా స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పారు. అదే విధంగా లీసా ప‌హ‌ల్గామ్ దాడిలో చ‌నిపోయిన‌వారికి నివాళులు అర్పించారు. ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌డానికి ప్ర‌పంచ‌దేశాలు ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు.

Next Story