58 ఏళ్ల వయసులో 8వ సారి తండ్రి కాబోతున్న మాజీ ప్రధాని

by Dishafeatures2 |
58 ఏళ్ల వయసులో 8వ సారి తండ్రి కాబోతున్న మాజీ ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ముచ్చటగా ఎనిమిదో సారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య క్యారీ జాన్సన్ ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. ‘‘ నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఇంకొన్ని వారాల్లో మా కుటుంబంలోకి మూడో చైల్డ్ రాబోతుంది’’ అంటూ కామెంట్ చేశారు. కాగా క్యారీ జాన్సన్ (35) బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు మూడో పెళ్లాం. 2021 మే లో వీరు వివాహం చేసుకున్నారు. అనంతరం వీరికి విల్ఫ్, రోమీ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అంతకు ముందు మెరీనా వీలర్ అనే వ్యక్తిని బోరిస్ జాన్సన్ పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ జంటకు నలుగురు పిల్లలు పుట్టారు. అంతేకాకుండా హెలెన్ మ్యాసింటైర్ అనే మరో మహిళతో బోరిస్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని, ఈ నేపథ్యంలోనే వీరికి ఓ పాప పుట్టిందని ప్రచారంలో ఉంది. కానీ బోరిస్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా వెల్లడించలేదు. ఇక బోరిస్ మొదటి భార్య అలెగ్రా మొస్టిన్ ఓవెన్ కు పిల్లలు కలగలేదు. మొత్తానికి మూడు పెళ్లిల్లు చేసుకున్న బోరిస్ జాన్సన్ ఎనిమిదో సారి తండ్రి కాబోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.




Next Story