Breaking news: బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుడిగా మరోసారి ఎలాన్ మస్క్

by Shiva |
Breaking news: బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుడిగా మరోసారి ఎలాన్ మస్క్
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా తన స్థానాన్ని మస్క్ తిరిగి నిలబెట్టుకున్నారు. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్‌ ఆస్తుల విలువ సుమారు 208 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆస్తుల విలువ 205 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 199 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. తాజాగా, టెస్లా షేర్ల విలువ విపరీతంగా పెరగడంతో మస్క్‌ మరోసారి ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ఇక భారత్ నుంచి 113 బిలియన్ డాలర్లతో ముకేష్ అంబానీ 13వ స్థానంలో, 108 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.



Next Story