కర్ణాటక లో స్కూల్ కు బాంబు బెదిరింపు..

by Shamantha N |

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సోమవారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో ఉలికిపడ్డారు.

కర్ణాటక లో స్కూల్ కు బాంబు బెదిరింపు..
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సోమవారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో ఉలికిపడ్డారు. ఈ బెదిరింపు నేపథ్యంలో విద్యార్థులను తక్షణమే పాఠశాల భవనం నుంచి ఖాళీ చేయించారు. విద్యోదయ పబ్లిక్ స్కూల్‌లో ఉడిపి పోలీసులు ప్రత్యేక బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బాంబు నిర్వీర్య దళం,జాగిలాలతో సెర్చ్ నిర్వహించాయి. స్కూల్ ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు. పూర్తిగా స్కూల్ పరిసరాలను పరిశీలించిన తర్వాత సురక్షితమని తేల్చారు.

నకిలీ ఈ మెయిల్ తో బెదిరింపులు

ఈమెయిల్‌ను ఉడిపి పోలీసులు నకిలీదని గుర్తించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని మూలాలను కనుక్కొనేందుకు విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనే జనవరి 2025లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ ద్వారా వచ్చాయి. ఈరోడ్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిండల్ , తెర్కుపల్ల ప్రాంతాల్లోని భారతి విద్యా భవన్ నిర్వహించే రెండు మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలకు ఉదయం 11:54 గంటలకు ఈమెయిల్ వచ్చింది. ‘బాంబులు ఏ క్షణంలోనైనా పేలవచ్చు’ అనే హెచ్చరికతో వచ్చిన ఆ ఈమెయిల్ అందరినీ ఉలికి పడేలా చేసింది. దీనికి స్పందనగా, పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులను సమాచారం ఇచ్చింది. బాంబు స్క్వాడ్‌, స్నిఫర్ డాగ్స్‌, అదనపు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సమగ్రంగా తనిఖీలు నిర్వహించి అది నకిలీ మెయిల్ గా తేల్చారు.

Next Story