- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి.!
పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ పిషిన్ జిల్లాలో జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు సహా ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో పాటు 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ పిషిన్ జిల్లాలో జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు సహా ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో పాటు 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సుర్ఖబ్ చౌక్ సమీపంలో ఉన్న ప్రధాన మార్కెట్ లో జరిగింది. అయితే ఈ దాడులకు కారణం తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) కారణమని తెలుస్తోంది. కాగా టీటీపీ 2022 లోనే ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నప్పటికీ.. ప్రస్తుతం మళ్ళీ బాంబ్ బ్లాస్టులు జరుగుతుండటంతో, ఆ ఒప్పందాలను ఉల్లంఘించి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకెళ్తే...
బలూచిస్థాన్లోని.. పిషిన్ సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముజిబుర్ రెహమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పేలుడు పదార్థాన్ని మోటార్ సైకిల్ లో ఉంచినట్లు తెలిపారు. బాంబ్ బ్లాస్ట్ అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. తదనంతరం కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ), బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పిషిన్ సిటీ అధికారి వెల్లడించారు. అయితే, ఈ ఘటనను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. చిన్నపిల్లలు, మహిళలపై జరిగే దాడులను పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. బ్లాస్ట్ లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.






