- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్‌లో సంచలనం.. ఒక సీటు గెలిచిన బీజేపీ
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు బీఎన్‌పీ ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు బీఎన్‌పీ ప్రకటించింది. ఈ క్రమంలో బీఎన్‌పీ నేత తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. అయితే.. అనూహ్యంగా బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఖాతా తెరిచింది. అయితే ఇది మన భారతీయ జనతా పార్టీ కాదు.. బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (BJP). ఈ బీజేపీకీ, భారత్‌తో ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో అందలీవ్ రెహమాన్ పార్థో అనే అభ్యర్థి బీజేపీ తరపున పోటీ చేసి భోలా-1 నియోజకవర్గం నుండి గెలిచారు. అయితే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఈ బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేసింది. ఈ గెలుపుతో అధికార కూటమిలో భాగస్వామి కాబోతోంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఎ-ఇస్లామీ మధ్య నెలకొంది. చివరకు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ విజయం సాధించింది.






