- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మూడేళ్లలో కూలిపోతుంది: కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం జంతర్ మంతర్‌లో నిర్వహించిన సభలో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం జంతర్ మంతర్‌లో నిర్వహించిన సభలో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ‘జహాన్ జుగ్గీ వహాన్ మకాన్’ అనే హామీని విస్మరించి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జుగ్గీలను (పేదల గుడిసెలు) బుల్డోజర్లతో కూల్చివేస్తోందని ఆరోపించారు. ‘వేసవి పేదలను ఇళ్లలో ఉండకుండా అనాగరిక చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఇలా బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చుతూ పోతే ప్రజలు మీకిచ్చిన అయిదేళ్లు కూడా పరిపాలించలేరని మూడేళ్లలోనే మీ ప్రభుత్వం పడిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు తాను చేసిన హెచ్చరికలను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన మోడీ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని ‘ఫేక్ గ్యారంటీలు’ అయ్యాయని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. మూడు సంవత్సరాల్లోనే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.
ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా రద్దు చేస్తారు
బీజేపీ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా రద్దు చేయనుందని ఆరోపించారు. ఇప్పటిదాకా నేను చెప్పినవి నిజం అయ్యాయి. ఇదీ కూడా నిజమే అవుతుందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని, వీరిని ‘బెహన్-భాయ్’ గా విమర్శించారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ పార్టీలు, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సౌరభ్ భరద్వాజ్‌లపై కేసులు వేయడమే పనిగా పెట్టుకున్నాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచదేవ్ స్పందిస్తూ.. కొవిడ్ సమయంలో పేద ప్రజల్ని తరమిమేసిన వ్యక్తి ఇప్పుడు బీజేపీని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నక్స లైట్ మైండ్ సెట్ తో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుచోట్ల పునరావాసం కల్పించిందని ‘జహాన్ జుగ్గీ వహాన్ మకాన్’ ప్రోగ్రాం కొనసాగుతుందని తెలిపారు.






