- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Melinda: 60 ఏళ్ల ఏజ్‌లో బిల్‌గేట్స్ మాజీ భార్యకు కొత్త బాయ్‌ఫ్రెండ్
దిశ, నేషనల్ బ్యూరో : అపర కుబేరుడు బిల్‌గేట్స్(Bill Gates) మాజీ భార్య 60 ఏళ్ల మెలిండా ఫ్రెంచ్ గేట్స్(Melinda) తన కొత్త బాయ్‌ఫ్రెండ్ 51 ఏళ్ల ఫిలిప్ వాన్(Philip Vaughn)తో కలిసి తొలిసారిగా మీడియాకు కనిపించారు. తాజాగా న్యూయార్క్ నగరంలోని ఫ్రెంచ్ రెస్టారెంట్ లీ బెర్నార్డిన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి వారిద్దరూ కలిసి హాజరయ్యారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని నడుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ రెస్టారెంటులోకి వెళ్లారని కథనాల్లో ప్రస్తావించారు. 2021 ఆగస్టులో బిల్‌గేట్స్ నుంచి మెలిండా విడాకులు తీసుకున్నారు. ఈ పరిణామం చోటుచేసుకున్న మూడేళ్ల తర్వాత.. తాను డేటింగ్‌కు సిద్ధమని మెలిండా ప్రకటించారు.
ఈక్రమంలో తొలుత ఆమె కొన్నాళ్ల పాటు ఫాక్స్ న్యూస్ కరస్పాండెంట్ జోన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేశారు. ఇప్పుడు అమెరికా వ్యాపారవేత్త ఫిలిప్ వాన్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఫిలిప్ నేపథ్యంలోకి వెళితే.. ఆయన 1999 నుంచి 2008 వరకు మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో పరిచయం ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 2011 సంవత్సరం నుంచి ‘తావౌర్’ పేరుతో బీర్ డెలివరీ సర్వీసులను ఫిలిప్ వాన్ నడుపుతున్నాడు. మరోవైపు ఒరాకిల్ కంపెనీ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ 2019లో చనిపోయారు. మార్క్ హర్డ్ భార్య పాలా హర్డ్‌తో 69 ఏళ్ల బిల్‌గేట్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.