నితీశ్ సర్కారు బిహార్ ను ‘నేర రాజధాని’గా మార్చారు: రాహుల్ గాంధీ

by Shamantha N |

పాట్నా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

నితీశ్ సర్కారు బిహార్ ను ‘నేర రాజధాని’గా మార్చారు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పాట్నా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం బిహార్ ను దేశ నేర రాజధానిగా మార్చిందని ఆరోపించారు. నేడు, బీహార్ దోపిడీ, కాల్పులు హత్యలకు నిలయంగా మారిందన్నారు. నేరాలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమవుతున్నాయని ట్వీట్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పిల్లలను రక్షించలేని ప్రభుత్వానికి ఓటు వేయవద్దని రాహుల్ గాంధీ బిహార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి హత్య, ప్రతి దోపిడీ, ప్రతి బుల్లెట్ మార్పు కోసం చూస్తోంది. కొత్త బీహార్ కోసం సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. భయం కాదు పురోగతి సాధించాలి. ఈసారి మీ ఓటు ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు బిహార్‌ను కాపాడటానికి అని ఆయన తన ఎక్స్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.

పోలీసులు రావడానికి రెండు గంటలా..

మగధ్ హాస్పిటల్ యజమాని గోపాల్ ఖేమ్కాను శుక్రవారం రాత్రి 11:40 గంటలకు బిహార్ రాజధానిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో గుర్తు తెలియని బైక్‌పై వచ్చిన దుండగుడు కాల్చి చంపాడు. బీజేపీ నాయకుడు అయిన అతని కుమారుడు గుంజన్ కూడా పట్టపగలు ఇదే విధంగా ఆరు సంవత్సరాల కిందట హత్య కాబడ్డాడు.సీసీటీవీలో ఈ సంఘటన రికార్డైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉండగా రాజకీయ వివాదాన్ని రేపింది. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ పోలీసులు నేరస్థలానికి చేరుకోవడానికి రెండు గంటలు పట్టిందని ఆరోపించారు. ఇది ఒక భయంకరమైన సంఘటన. వ్యాపారవేత్తలు బిహార్ విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ఈ సంఘటన పాట్నా నడిబొడ్డున జరిగింది. అయినప్పటికీ, పోలీసులు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటలు పడుతుందని అన్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌తో సహా కీలక అధికారులు నివసించే ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎలా జరుగుతుందని పోలీసులను ప్రశ్నించారు. ఖేమ్కా కుటుంబ సభ్యులందరూ చనిపోవాలని బిహార్ ప్రభుత్వం కోరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.

Next Story