అమెరికాలో వలసదారులైన ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

by Ajay Maddhiboyina |

అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసే వ‌ల‌సదారుల‌కు ట్రంప్ స‌ర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ సిస్ట‌మ్‌లో ఇమ్మిగ్రేష‌న్ స్టేట‌స్‌ను రిస్క్ ఫ్యాక్ట‌ర్‌గా చూడాల‌ని ట్రంప్ ఆదేశించారు. ఈమేర‌కు స‌రికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ ఇచ్చారు. హెచ్-1బీ వీసా హోల్డ‌ర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాల‌పై నిఘా పెంచాల‌ని, లోన్లు ఇచ్చే ముందు వీసాల‌ను చెక్ చేయాల‌ని ఆదేశించారు.

అమెరికాలో వలసదారులైన ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసే వ‌ల‌సదారుల‌కు ట్రంప్ స‌ర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ సిస్ట‌మ్‌లో ఇమ్మిగ్రేష‌న్ స్టేట‌స్‌ను రిస్క్ ఫ్యాక్ట‌ర్‌గా చూడాల‌ని ట్రంప్ ఆదేశించారు. ఈమేర‌కు స‌రికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ ఇచ్చారు. హెచ్-1బీ వీసా హోల్డ‌ర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాల‌పై నిఘా పెంచాల‌ని, లోన్లు ఇచ్చే ముందు వీసాల‌ను చెక్ చేయాల‌ని ఆదేశించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై వ‌ల‌స‌దారుల సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయ‌ప‌రంగా పోరాడ‌తామ‌ని చెబుతున్నాయి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిననాటి నుండి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం పేరుతో ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వసలదారులకు బ్యాంకుల నుండి లోన్లు రావడం కష్టతరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చట్టబద్ధంగా వీసాలు ఉన్న, వీసాలు లేని వసలదారులను ట్రంప్ సర్కార్ నిర్భందించింది దేశం నుండి బహిష్కరించింది. వీసాలు, పౌరసత్వం దరఖాస్తులపై నిఘా పెంచింది. దీంతో పాటు మెల్లి మెల్లిగా వలస దారులకు ప్రభుత్వ సేవలు పరిమితం చేస్తూ వారిని సొంతదేశాలకు వెళ్లిపోయేలా చేస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ తాజా నిర్ణయం సైతం వివాదాస్పదంగా మారింది.

Next Story