- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో భారీ మార్పులు?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) కర్ణాటక కాంగ్రెస్ నేతలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దిశ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) కర్ణాటక కాంగ్రెస్ నేతలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కర్ణాటక లో ముఖ్యమైన నేతల బాధ్యతలు, పార్టీ కేడర్‌లో భారీ మార్పులు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి. పరమేశ్వరన్ కీలక బాధ్యతలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సూచన మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రణదీప్ సుర్జేవాలా, కే సీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు కేబినెట్ మార్పులపై త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు బీకే హరిప్రసాద్, ఆర్వీ దేశ్‌పాండే లాంటి నాయకులు మంత్రివర్గంలోకి చాన్స్ వచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయంలోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాజాగా రాజీనామా చేసిన సీఎంవో రాజకీయ కార్యదర్శి కే. గోవిందరాజ్ స్థానంలో కొత్త నేతను నియమించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ నుంచి తొలగింపు?
ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ (dk shiva kumar) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన బాధ్యతలు తొలగించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన (సామాజిక-ఆర్థిక సర్వే)ను తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా బెంగళూరులో చిన్న స్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం సిద్ధరామయ్య (sidda ramayya) జూన్ 5న కేబినెట్ సమావేశం తర్వాత బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానందతో పాటు పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం విపక్షాలతో పాటు నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక రాజకీయాలు వేడి రాజేస్తున్నాయి.






