- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్ లోని షహర్-ఎ-నవ్ పరిసరాల్లో ఉన్న ఒక హోటల్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ పేలుడు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్ లోని షహర్-ఎ-నవ్ పరిసరాల్లో ఉన్న ఒక హోటల్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ పేలుడు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. విదేశీయులు నివసించే, అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించే షహర్-ఎ-నవ్ లో ఈ పేలుడు జరగడంతో రాజధాని నగరం ఉలిక్కిపడింది. పెద్ద కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్సులు, రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో పేలుడు జరగడంతో అక్కడి భద్రతా లోపాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటాలియన్ ఎన్జీఓ ఎమర్జెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం పేలుడు సంభవించగా.. వెంటనే మా సర్జికల్ సెంటర్లో ఉన్న ఆస్పత్రిలో 20 మందిని చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. ఇప్పటివరకూ ఈ పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. దీంతో ఇది బాంబు పేలుడా? లేక ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలిందా ? అని భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి.






