- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharat Bandh: ఫిబ్రవరి 12న భారత్ బంద్..కారణం ఇదే !
ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ ఉండనుంది. అమెరికా-ఇండియా మధ్య జరిగిన ఒప్పందం కారణంగా భారతీయ రైతులు, పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ నెలలో భారత్ బంద్ ఉండనుంది. ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రేడ్ డీల్ ను నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు కీలక ప్రకటన చేశాయి.
ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్
ఇంత ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ ఉండనుంది. అమెరికా-ఇండియా మధ్య జరిగిన ఒప్పందం కారణంగా భారతీయ రైతులు, పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు ఆందోళన చెందుతున్నారు. భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ భారత్ బంద్ లో భాగంగా, ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలను చేపట్టాలని రైతు సంఘాలు ఆదేశాలు జారీచేశాయి. అన్ని రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






