- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Grammy 2025: గ్రామీ అవార్డుల వేడుకలు.. 'కౌబాయ్ కార్టర్' ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్
సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డు 2025 ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే (Grammy Awards) గ్రామీ అవార్డు 2025 ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్ ఏంజెల్స్ పీకాక్ థియేటర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పాప్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్, నటి బియాన్స్ నోల్స్ (Beyonce) అత్యున్నత అవార్డు కైవసం చేసుకుంది. బియాన్స్ ఇటీవల చేసిన 'కౌబాయ్ కార్టర్'కు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం 11 నామినేషన్లు రాగా జాబితాలో కౌబాయ్ కార్టర్ అగ్రస్థానంలో నిలిచింది.
భారతీయ సంతతి సింగర్‌కు అవార్డు
ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు గ్రామీ పురస్కారం వరించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న కన్నుమూశారు. ఆయన రచించిన ‘ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్’కు బెస్ట్ ఆడియోబుక్ నెరేషన్ విభాగంలో అవార్డు లభించింది. అదేవిధంగా ఈ వేడుకల్లో భారతీయ సంతతికి చెందిన ఇండో- అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు కేవసం చేసుకుంది. ఇటీవల కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు ప్రమాదం అందరికీ తెలిసిందే. ఎంతోమంది జీవితాల్లో విషాదం మిగిల్చింది. ఈ క్రమంలోనే కార్చిచ్చు కారణంగా జీవితాన్ని కోల్పోయిన బాధితులకు కార్యక్రమంలో సంతాపం ప్రకటించారు.
న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులు
పాప్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం వివాదంగా మారింది. అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ బెస్ట్ ర్యాప్ సాంగ్‌కు నామినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఫంక్షన్‌కు తన భార్య, మోడల్ బియాంకా తో కలిసి వచ్చారు. అవార్డ్ ఫంక్షన్‌లోకి రాగానే రెడ్ కార్పెట్‌పై నడుస్తూ.. ఒక్కసారిగా తన దుస్తులు తీసేసీ న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ఆమె తీరును చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే ఆ జంటను నిర్వాహకులు బయటకు పంపించేశారు.






