- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: ఇరాన్ మాతో పెట్టుకోవద్దు జాగ్రత్త.. ట్రంప్ హెచ్చరిక
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారంలో స్పందిస్తూ.. ఇరాన్, అమెరికా ఆస్తులపై ఏదైనా రూపంలో ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తే అమెరికా సాయుధ దళాల సంపూర్ణ బలం, శక్తి ఇంతకు ముందు మీరు ఎన్నడూ చూడని స్థాయిలో చూడాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. శనివారం ఇజ్రాయెల్, టెహ్రాన్‌లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద క్షిపణి దాడులు జరిపింది. బుషెహర్ ప్రావిన్స్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రానికి అనుసంధానించబడిన సహజ వాయువు ప్రాసెసింగ్ యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపింది. ఈ దాడుల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాకు ఈ దాడులతో సంబంధలేదని స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందంతోనే ఘర్షణను ముగించగలుగుతామన్నారు.
అణు చర్చలు రద్దు
ఇరాన్ ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో జరగాల్సిన ఆరో విడత అణు చర్చలు రద్దయ్యాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ లో 60 మందికిపైగా చనిపోయారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో 29 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరానియన్ క్షిపణి దాడిలో ఇజ్రాయిల్ లో నలుగురు చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. గలిలీ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ పై ఇరాన్ దాడి చేయగా నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది.
Israel attacks:ఇరాన్ లోని అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడి






