- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel-Iran War : ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం.. అమెరికా మరో ప్రకటన
పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం(Israel - Iran War) జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం(Israel - Iran War) జరుగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్‌లోని షహరాన్ చమురు కేంద్రాలపై దాడి చేసింది. రెండు రోజుల వ్యవధిలో ఇరాన్‌లో 80 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో చేసేదేం లేక ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పుడుతోంది. టెల్ అలీవ్, హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది మృతి, పలువురికి గాయాలు అయ్యాయి. దీనిని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాస్సీం గైడెడ్ బాలిస్టిక్ మిసైల్‌ను వినియోగించారు. మరోవైపు ఇరాన్‌తో మొదలైన సంక్షోభం రోజుల్లో ముగిసే విషయం కాదని అమెరికా(America) అధికారులు పేర్కొన్నారు. దీనికి కొన్ని వారాల సమయం పట్టొచ్చన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌కు అమెరికా అనుమతి పరోక్షంగా లభించినట్లు వారు పేర్కొన్నారు.






