- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Israel-Iran War :ఇరాన్ లోని అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడి
ఇజ్రాయిల్ ఇరాన్ పై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఫైనాన్షియల్ గా కేంద్రం అయిన సౌత్ పార్స్ పై దాడి చేసింది

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ ఇరాన్ పై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఫైనాన్షియల్ గా కేంద్రం అయిన సౌత్ పార్స్ పై దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రం కావడం గమనార్హం. ఇరాన్ అణు కేంద్రాలైన 150 ప్రాంతాలపై ఇజ్రాయిల్ దాడులకు తెగబడింది. ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన ప్రకటనలో ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో షహ్రాన్‌లోని భారీ గ్యాస్ క్షేత్రం ధ్వంసమయినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 11 గ్యాస్ నిల్వ ఉన్న ట్యాంకులు కూడా ఒకదాని తర్వాత ఒక్కోటి పేలిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సమీప ప్రాంతాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తాజాగా ఇజ్రాయిల్ ఓ అపార్ట్ మెంట్ పై దాడి చేయగా అందులో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 29 మంది పిల్లలున్నట్లు ఇరాన్ పేర్కొంది.
అణు కేంద్రం ధ్వంసం
శనివారం నుంచి ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ రాజధాని లక్ష్యంగా ఇజ్రాయిల్ మిస్సైళ్లు, యుద్ధ విమానాలతో దాడులకు తెగబడుతోంది. అటు ఇరాన్ కూడా వందల డ్రోన్లతో ఇజ్రాయిల్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయిల్ లోని గలీలీ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో నలుగురు మరణించినట్లు ఇజ్రాయిల్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో రోజు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. నతాంజ్ అణు కేంద్ర ఉపరితల భాగం కూడా ధ్వంసం కావడం గమనార్హం. ఇది టెహ్రాన్ కు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ పేర్కొంది.






