బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన.. జూ కీపర్‌ను పీక్కుతిన్న సింహాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-11 14:47:19  IST  )

బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జూకీపర్‌ను సింహాలు పీక్కు తిన్నాయి. బ్యాంకాక్ ఓపెన్ ఎయిర్ జూలో ఈ ఘటన జరిగింది. జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి 20 ఏళ్లుగా జూలో పనిచేస్తూ జంతువుల బాగోగులు చూసుకుంటున్నాడు.

బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన.. జూ కీపర్‌ను పీక్కుతిన్న సింహాలు
X

దిశ, వెబ్ డెస్క్: బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జూకీపర్‌ను సింహాలు పీక్కు తిన్నాయి. బ్యాంకాక్ ఓపెన్ ఎయిర్ జూలో ఈ ఘటన జరిగింది. జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి 20 ఏళ్లుగా జూలో పనిచేస్తూ జంతువుల బాగోగులు చూసుకుంటున్నాడు. కాగా అతడు విధుల్లో ఉన్న సమయంలో సింహాలు దాడి చేసి హతమార్చాయి. అనంతరం అతడి శరీరాన్ని కొంత భాగం వరకు తినేశాయి. ప‌ర్యాట‌కుల‌తో క‌లిసి అత‌డు స‌ఫారీ వాహ‌నంలో సింహాల వ‌ద్ద‌కు వెళ్ల‌గా ఈ దాడి జ‌రిగింది.

వాహ‌నం నుండి కిందకు దిగిన స‌మ‌యంలో మొద‌ట ఒక సింహం దాడి చేయ‌గా త‌ర‌వాత మిగితావ‌న్నీ సైతం దాడికి పాల్ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో ప‌ర్యాట‌కులు వాహ‌నంలోనే ఉన్నప్ప‌టికీ భ‌యంతో కింద‌కు దిగ‌లేక‌పోయారు. వాహనాల హారన్లు కొడుతూ గట్టి గట్టిగా అరిచినా అక్కడ నుండి వెళ్లకుండా దాదాపు 15 నిమిషాలకు పైగా అతడిపై దాడి చేసి తింటూ కదలకుండా కూర్చుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూకీప‌ర్ మృతికి యాజ‌మాన్యం సంతాపం ప్ర‌క‌టించింది. అత‌డి కుటుంబానికి అండంగా ఉంటామ‌ని హామీ ఇచ్చింది. గ‌త 40 ఏళ్ల‌లో ఇలాంటి ఘ‌ట‌న ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని తెలిపింది. video

Next Story