Bangladesh : సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం

by Maddikunta Saikiran |
Bangladesh : సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న నేషనల్ హాలిడేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1975 సంవత్సరం ఆగస్టు 15న షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేయబడ్డారు. దీంతో గత ప్రభుత్వం షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గుర్తుగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మంగళవారం ఢాకాలోని జమున ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో పాటు పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 15న సెలవును రద్దు చేస్తూ మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

కాగా ముజిబుర్ రెహమాన్ 1975, ఆగస్టు 15న తన నివాసంలో కుటుంబంతో సహా ఆయన హత్యకు గురయ్యారు. దీంతో గత ప్రభుత్వం ఆగస్టు 15ని ముజిబుర్ రెహమాన్ మృతికి గుర్తుగా ఆ రోజు సెలవు ప్రకటించింది బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన ముజీబ్‌ని 'బంగాబంధు' అని పిలుస్తారు, అంటే 'బెంగాల్ స్నేహితుడని అర్థం. ముజీబ్ మరణానంతరం అతని నివాసాన్ని మ్యూజియంగా మార్చారు.అయితే మొన్న జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు . దీంతో కోపోద్రిక్తులైన బంగ్లాదేశస్తులు ముజీబ్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మ్యూజియాన్ని తగలబెట్టారు. ఈ మేరకు హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ తన సోషల్ మీడియా X లో షేక్ హసీనా తరపున ఒక ప్రకటన విడుదల చేశారు.తన పార్టీ అవామీ లీగ్‌ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఉగ్రదాడులుగా అందులో పేర్కొన్నారు. అలాగే జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరిగిన రోజు ఆగస్టు 15న సంతాప దినంగా ఘనంగా జరుపుకోవాలని తన దేశస్తులకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed