నేడు చంచల్‌గూడ జైలుకు మాజీ మంత్రి కేటీఆర్‌

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని, మిలిటెంట్ తరహా పోరాటం చేయాలని సుమన్ ఓ కార్యక్రమంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నేడు చంచల్‌గూడ జైలుకు మాజీ మంత్రి కేటీఆర్‌
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని, మిలిటెంట్ తరహా పోరాటం చేయాలని సుమన్ ఓ కార్యక్రమంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు తెలంగాణ భవన్ వద్ద సుమన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా అతడికి 14రోజుల రిమాండ్ విధించారు.

సుమన్‌పై పలు కఠిన సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ 326 (జీ), 55, 61 (2), 351 (3), 353 (1), 152తో పాటు పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్రంలో దుమారం రేగింది. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు కేటీఆర్ సైతం సుమ‌న్ చేసిన కామెంట్లు త‌ప్పేన‌ని ఒప్పుకున్నారు. కానీ సుమ‌న్ ఆ ఉద్దేశంతో మాట్లాడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయ‌న‌ను జైలులో పరామార్శించిన త‌ర‌వాత కేటీఆర్ మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

Next Story