- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజే జ్ఞానవేల్ సినిమాలో అలాంటి పాత్రలో కనిపించనున్న సూర్య
ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా సూర్యతో టీజే జ్ఞానవేల్ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా ‘కరుప్పు’ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో మరోసారి జతకట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం భారీ ప్రశంసలు అందుకుంది. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ఆదరణను పొందింది. అనంతరం జ్ఞానవేల్, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘వెట్టాయన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇక తాజాగా సూర్యతో జ్ఞానవేల్ ఓ బయోపిక్‌ను ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఛాతీ వ్యాధుల నిపుణుడైన డాక్టర్ తిరువేంగడం కేవలం రూ.2, రూ.5 ఫీజుతో పేదలకు వైద్య సేవలు అందించి విశేష గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథను ఆధారంగా చేసుకుని సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.






