తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికై గంటల తరబడి నిరీక్షణ

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటల సమయానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికై నిరీక్షిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికై గంటల తరబడి నిరీక్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటల సమయానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికై నిరీక్షిస్తున్నారు. 8 గంటల తర్వాత టోకెన్ లేకుండా ఉచిత దర్శన క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొంది.. స్వామివారి దర్శనం కసం ఎదురుచూస్తున్న భక్తులకు 4-6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (బుధవారం) స్వామివారిని 84,220 మంది భక్తులు దర్శించుకోగా.. 40,542 మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. బుధవారం 3.99 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.17 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.

Next Story